కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవం
హైదరాబాద్ – రాష్ట్రంలో ప్రభుత్వం మారి పోయే సరికల్లా బలా బలాలు, సమీకరణలు కూడా మారి పోతున్నాయి. ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీలో యువత పరంగా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు బల్మూరి వెంకట్. తనకు తాజాగా జరిగిన ఎన్నికల్లో సీటు వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాక పోవడంతో కొంత నిరాశకు లోనయ్యారు. కానీ ఉన్నట్టుండి అదృష్టం వరించింది వెంకట్ కు. అనుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటును ఖరారు చేసింది ఏఐసీసీ హైకమాండ్.
మరో వైపు దురదృష్టం వెంటాడింది మరోసారి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉన్న అద్దంకి దయాకర్ కు. ఆయనను ఎంపిక చేసిన హై కమాండ్ ఉన్నట్టుండి ఆఖరు నిమిషంలో పేరు మార్చేసింది. అద్దంకికి బదులు మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేసింది. దీంతో విస్మయానికి లోనయ్యారు దయాకర్. కానీ పార్టీ కోసం చివరి దాకా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా నామినేషన్లు వేసేందుకు చివరి రోజు జనవరి 18 న కావడంతో ఇప్పటి వరకు కేవలం రెండే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. ఈనెల 22న అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు రిటర్నింగ్ ఆఫీసర్.
ఈ సందర్బంగా బల్మూరి, గౌడ్ లను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ అభినందించారు.