ముద్రగడకు పవన్ ఆహ్వానం
జనసేన పార్టీలోకి రావాలన్న జనసేనాని
అమరావతి – ఏపీలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎవరిని కలుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంత కాలం కాపుల పక్షాన తన గొంతు విప్పుతూ వస్తున్నారు సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఈ సందర్భంగా అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఆయనను తమ వైపు రప్పించే ప్రయత్నం చేసింది.
ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ త్రిమూర్తులును జగన్ దూతగా పంపించారు. కానీ స్పందించ లేదు , ఎలాంటి ప్రకటన చేయలేదు ముద్రగడ పద్మనాభం. రాష్ట్రంలో తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. అంతకు మించిన అనుచర గణం కూడా ఉంది.
ఈ సందర్బంగా ముద్రగడ పద్మనాభం సంచలన కామెంట్స్ చేశారు. చచ్చినా సరే తన శరీరంలో కొన ఊపిరి ఉన్నంత వరకు ఇంట్లో ఉంటాను కానీ వైసీపీలో చేరనని ప్రకటించారు. ఈ సమయంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆయనను తమ పార్టీలోకి రావాలని కోరారు. అంతకు ముందు తాను టీడీపీలో కానీ లేదా జనసేన పార్టీలో చేరతానని తెలిపారు ముద్రగడ.
తాజాగా జనసేన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయంగా పవన్ వెళ్లి ముద్రగడను ఆహ్వానిస్తారని చెప్పారు. ఆయన ఈనెల 20 లేదా 23న పార్టీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉందన్నారు.