ANDHRA PRADESHNEWS

మోదీ ఎల్ల‌ప్పుడూ ప్ర‌ధానిగా ఉండాలి

Share it with your family & friends

ఆకాంక్షించిన న‌టుడు మోహ‌న్ బాబు

తిరుప‌తి – ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌క‌ర సంక్రాంతి సంద‌ర్బంగా ఆయ‌న త‌న స్వంత ఊరుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

కోటి హ‌నుమాన్ చాలీసా తిరుప‌తిలో జ‌ర‌గ‌డం మ‌నంద‌రి అదృష్టంగా భావించాల‌ని అన్నారు. త‌న జీవితంలో ఇలాంటి పీఎంను ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. ఇవాళ నేను ఏది మాట్లాడినా అది వైర‌ల్ గా మార‌డం త‌న‌కు ఇష్టం లేద‌న్నారు. తాను ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు.

మోదీ లాంటి బ‌ల‌మైన నాయ‌కుడు ఉండ‌డం వ‌ల్ల‌నే మ‌నంద‌రం ఇవాళ ప్ర‌శాంతంగా ఉన్నామ‌ని గుర్తు చేసుకోవాల‌న్నారు మోహ‌న్ బాబు. మోడీ లేక పోతే ఈ ప‌రిస్థితులు ఉండేవి కావ‌న్నారు. కులాలు అనేవి లేవ‌ని, తెలిసో తెలియ‌కో కొంద‌రు కులాలు, మ‌తాల గురించి మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

మోడీ ఒక్క‌రే అంద‌రూ క‌లిసి ఉండాల‌ని కోరుకున్నార‌ని, ఎల్ల‌ప్పుడూ ఆయ‌నే ప్ర‌ధాన మంత్రిగా ఉండాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశారు మోహ‌న్ బాబు. అయోధ్య అనేది ఒక చ‌రిత్ర‌. త‌న‌కు కూడా రావాల‌ని ఆహ్వనం అందింద‌ని , ఇందుకు ప్ర‌ధానికి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్టు చెప్పారు.