రాంగ్ రూట్ లో బాబు హెలికాప్టర్
పైలట్ ను హెచ్చరించిన ఏటీసీ
అమరావతి – ఎన్నికల వేళ బిజీగా పర్యటనలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు గండం తప్పింది. ఆయన శనివారం విశాఖ పట్టణం నుంచి అరకు వెళ్లేందుకు హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు.
ఇదే సమయంలో హెలికాప్టర్ పైలట్ దారి తప్పాడు. దీంతో రాంగ్ రూట్లో వెళ్లడాన్ని వెంటనే గుర్తించింది ఏటీసీ. దీంతో పైలట్ ను హెచ్చరించింది. వెంటనే దారి మళ్లించాలని తిరిగి రావాలంటూ ఆదేశించింది. హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తున్న చంద్రబాబు, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఏటీసీ వార్నింగ్ దెబ్బకు పైలట్ దారి తప్పిన హెలికాప్టర్ ను సక్రమ మార్గం వైపు మళ్లించారు. దీంతో చంద్రబాబు నాయుడు, టీం ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం ఏపీలో శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
ఇందు కోసం గత నెల నుంచి జోరు పెంచింది టీడీపీ. ఎన్నికల బరిలో దిగేందుకు పావులు కదుపుతోంది. జనసేన పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు, తనయుడు లోకేష్ బాబు.