రాముడి కోసం కొత్త బస్సులు
అయోధ్యలో ఆటోలు హల్ చల్
ఉత్తర ప్రదేశ్ – దేశ వ్యాప్తంగా అయోధ్య రామ మందిరం గురించి చర్చ జరుగుతోంది. ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. అన్ని రంగాలకు చెందిన వారిని గుర్తించి రావాలని కోరింది అయోధ్య లోని రామ మందిరం ట్రస్టు. ఈ మేరకు ఆహ్వానాలు అందుకున్న వారంతా సంతోషానికి లోనవుతున్నారు.
ఈనెల 22న ఓ అద్భుతం జరగబోతోందని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర సర్కార్ పూనుకుంది. కోట్లాది రూపాయలు ఇప్పటికే ఖర్చు చేసింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ఏర్పాట్లు చేసింది.
ఇప్పటి వరకు దేశంలో ఎందరో సీఎంలు ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక్క ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ అందించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు డైనమిక్ లీడర్ గా గుర్తింపు పొందిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.
ఇదిలా ఉండగా రామ మందిరం పునః ప్రతిష్ట కార్యక్రమం సందర్బంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీఎం. ఇదే సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సౌకర్యంగా ఉండేలా కొత్తగా బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయన జెండా ఊపి ప్రారంభించారు.