రాముడి సన్నిధిలో రణదీప్
దివ్య దర్శనం అద్భుతం
అయోధ్య – ప్రముఖ సినీ నటుడు రణ దీప్ హూడా ప్రత్యేక ఆకర్షణగా మారారు. అయోధ్య లోని రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో హూడా తన భార్యతో కలిసి పాల్గొన్నారు. తనకు ప్రత్యేకంగా రామ జన్మ భూమి ట్రస్టు ఆహ్వానం పలికింది. ఈ మేరకు బాలీవుడ్ కు చెందిన అతిరథ మహారథులు కూడా ఈ అరుదైన వేడుకలో పాలు పంచుకున్నారు.
ఇదిలా ఉండగా శ్రీరామ జన్మ భూమి ట్రస్టు దేశంలోని సినీ, క్రీడా, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన 7,000 వేల మందికి పైగా ప్రముఖులను పిలిచింది. వారికి సకల ఏర్పాట్లు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు.
శ్రీరాముడి విగ్రహానికి తన చేతితో తిలకం దిద్దారు ప్రధానమంత్రి. ఈ అపురూపమైన, అరుదైన ఘట్టాన్ని కోట్లాది మంది వీక్షించారు. 500 ఏళ్ల తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరకు ఆలయంగా రూపు దిద్దుకుంది. కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు. ఇక హనుమాన్ చిత్ర దర్శకుడు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తమ సినిమాకు సంబంధించి అమ్ముడు పోయిన టికెట్ కు రూ. 5 చొప్పున రామ జన్మ భూమి ట్రస్టుకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ. 2 కోట్లకు పైగా ఇప్పటికే ఇచ్చారు.