రాహుల్ యాత్రకు సీఎం మద్దతు
భారత్ జోడో న్యాయ్ యాత్ర షురూ
మణిపూర్ – రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభమైంది. భారీ ఎత్తున జనం ఆదరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, నేతలు, అభిమానులు సాదర స్వాగతం పలికారు. తాజాగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య రాహుల్ ను కలుసుకున్నారు. ఈ యాత్ర విజయవంతం కావాలని కోరారు.
ఇప్పటి వరకు తమిళనాడు నుంచి ప్రారంభించిన భారత్ జోడో యాత్ర కాశ్మీర్ వరకు కొనసాగింది. అన్ని వర్గాల ప్రజలు ఈ యాత్రను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు సీఎం. ఈనెల 14న మణిపూర్ వేదికగా స్టార్ట్ అయ్యింది. ఈ యాత్ర 67 రోజుల పాటు కొనసాగుతుంది.
కాలి నడకన రాహుల్ గాంధీ . ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తో పాటు అగ్ర నేతలంతా రాహుల్ తో పాలు పంచుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర బస్సుల్లోనే కాకుండా కాలి నడకన కూడా యాత్ర చేపడతారు రాహుల్ గాంధీ. 6,713 కిలోమీటర్ల మేర సాగుతుంది. మొత్తం 67 రోజుల పాటు కొనసాగుతుంది. 110 జిల్లాలు , 100 లోక్ సభ స్థానాలు, 377 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుందని పార్టీ తెలిపింది. ఈ యాత్ర ముంబై లో మార్చి 20 లేదా 21న ముగుస్తుందని తెలిపింది.