రూ. 8 వేల కోట్లతో లిథియం ఫ్యాక్టరీ
ప్రకటించిన గోడి ఇండియా లిమిటెడ్
దావోస్ – తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో దావోస్ లో చేసిన మూడు రోజుల పర్యటన జయప్రదంగా ముగిసింది. గురువారం నేరుగా దావోస్ నుంచి లండన్ కు బయలు దేరి వెళ్లారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూర్ చేపట్టినట్లు రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. ఇక యూకేలో రేవంత్ రెడ్డి టీం మూడు రోజుల పాటు పర్యటిస్తుంది. ఇక్కడ ప్రముఖ కంపెనీలు, సిఇఓలు, చైర్మన్లు, వ్యాపారవేత్తలను కలుసుకోనున్నారు సీఎం.
ఇక దావస్ లో జరిగిన సమావేశాలలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదానీ గ్రూప్ రూ. 12,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. విప్రో ఐటీ కంపెనీ వరంగల్ లో యూనిట్ ప్రారంభించనుంది. ఖమ్మంలో గోడ్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ యూనిట్ పెట్టనుంది. ఇందు కోసం రూ. 270 కోట్లు ఖర్చు చేయనుంది.
తాజాగా గోడి ఇండియా లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో లిథియం గెగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ తరపున ఒప్పందం చేసుకుంది. రూ. 8,000 కోట్ల పెట్టబడులతో 12.5 జీడబ్ల్యూహెచ్ సెల్ తయారీని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి.