రేవంత్ కు పెద్దన్నగా ఉంటా
సలహాలు..సూచనలు చేస్తా
హైదరాబాద్ – మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందూరు జానా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పాలన సాగిస్తోందని కితాబు ఇచ్చారు.
గతంలో స్వేచ్ఛ అన్నది లేకుండా పోయిందని వాపోయారు. కానీ ఇవాళ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్య స్పూర్తితో ముందుకు సాగుతున్నారని, వారంతా హాయిగా ఉన్నారని పేర్కొన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బందికి లోనైందన్నారు జానా రెడ్డి.
ప్రభుత్వం ప్రజల మధ్యన ఉందన్న భావన ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. మేధావులు , ప్రజా సంఘాలు, పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ప్రస్తుత సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై ఉందన్నారు.
ప్రస్తుతం సమస్యల నుంచి గట్టెక్కించేందుకు సీఎం నానా తంటాలు పడుతున్నారని, అవసరమైన సమయంలో తను సలహాలు , సూచనలు చేస్తానని సూచించారు. ఇదిలా ఉండగా కందూరు జానా రెడ్డికి అపారమైన రాజకీయ పరమైన అనుభవం ఉంది. ఆయనకు సౌముడ్యిగా , వివాద రహితుడిగా గుర్తింపు ఉంది.