రేవంత్ తో జగ్గా రెడ్డి భేటీ
రాష్ట్ర రాజకీయాలపై చర్చ
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య అరగంటకు పైగా చర్చలు జరిగాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి అన్యూహంగా ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏఐసీసీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మాణిక్ రావు ఠాక్రేను మార్చేసింది. ఇది ఒక రకంగా బిగ్ షాక్.
ఆయన వచ్చాక రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దారు. సీనియర్ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో కలిసికట్టుగా పార్టీ కోసం పని చేసేలా పావులు కదిపారు.
ఇదే సమయంలో జగ్గారెడ్డికి పుల్ సపోర్ట్ ఇచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు మెదక్ జిల్లాలో మంచి పట్టుంది. కానీ అనూహ్యంగా పరాజయం పొందడం పార్టీని, తనను కూడా విస్తు పోయేలా చేసింది. ఒకవేళ గెలిచి ఉంటే తను కేబినెట్ లో మంత్రి అయి ఉండే వారు.
ప్రస్తుతం ఎంపీగా గెలిపించు కోవాల్సిన బాధ్యత జగ్గారెడ్డిపై పెట్టింది హైకమాండ్. రాహుల్ గాంధీ స్వయంగా జగ్గన్నను గెలిపించాలని కోరారు. ఆయనంటే తనకు వల్లమాలిన అభిమానమని కితాబు ఇచ్చారు ప్రచారంలో పాల్గొన్న సందర్బంగా. అయితే సీఎంతో జగ్గన్న భేటీ కావడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది.