లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలి
పిలుపునిచ్చిన మల్లికార్జున్ ఖర్గే
హైదరాబాద్ – త్వరలో దేశ వ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. గురువారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్బంగా మన ముందు అత్యంత క్లిష్టమైన ఎన్నికలు వస్తున్నాయని ఇందులో కూడా మనందరం కలిసి కట్టుగా కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మల్లికార్జున్ ఖర్గే. కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉందన్నారు.
ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. బ్లాక్ స్థాయి, బూత్ స్థాయి, రాష్ట్ర స్థాయిలలో పార్టీకి చెందిన ఏజెంట్లు అత్యంత కీలకం కానున్నారని స్పష్టం చేశారు ఏఐసీసీ చీఫ్. మీరు లేక పోతే పార్టీ లేదన్నారు.
పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు ఖర్గే. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 17 ఎంపీల స్థానాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరు కొనసాగే ఛాన్స్ ఉంది.