ANDHRA PRADESHNEWS

విజ‌య‌వాడ డివిజ‌న్ లో ప‌లు రైళ్లు ర‌ద్దు

Share it with your family & friends

కొన్నింటిని దారి మ‌ళ్లిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న

విజ‌య‌వాడ – ద‌క్షిణ మ‌ధ్య రైళ్వే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. బెజ‌వాడ డివిజ‌న్ లో ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది. నిర్వ‌హ‌ణ ప‌నుల‌ను చేప‌డుతుండ‌డంతో కొన్నింటిని ర‌ద్దు చేసిన‌ట్లు పేర్కొంది. మ‌రికొన్నింటిని దారి మ‌ళ్లిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్ర‌క‌ట‌న వెల్ల‌డించింది.

జ‌న‌వ‌రి 29వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు 17239/17240 నెంబ‌ర్ క‌లిగిన గుంటూరు-విశాఖపట్నం రైలును,
07977/07978 నెంబ‌ర్ క‌లిగిన విజయవాడ-బిట్రగుంట రైలును , 29వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు 17219/17220 నెంబ‌ర్ క‌లిగిన మచిలీపట్నం-విశాఖపట్నం , 17243/17244 నెంబ‌ర్ క‌లిగిన గుంటూరు-రాయగడ రైలును ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది. ఇక విజ‌య‌వాడ రామ‌వ‌ర‌ప్పాడు మ‌ధ్య పాక్షికంగా జ‌న‌వ‌రి 29 నుంచి ఫిబ్ర‌వ‌రి 25 దాకా నిలిపి వేసిన‌ట్లు పేర్కొంది.

07896 నెంబ‌ర్ క‌లిగిన మచిలీపట్నం-విజయవాడ రైలు, 07769 విజయవాడ-మచిలీపట్నం, 07863 విజయవాడ- నర్సాపూర్‌, 07866 విజయవాడ- మచిలీపట్నం, 07770 మచిలీపట్నం- విజయవాడ, 07283 విజయవాడ- భీమవరం జంక్షన్‌, 07870 మచిలీపట్నం- విజయవాడ, 07861 విజయవాడ-నర్సాపూర్ ల‌ను వ‌యా విజ‌య‌వాడ‌, భీమ‌వ‌రం , నిడ‌ద‌వోలు నుంచి దారి మ‌ళ్లిస్తున్న‌ట్లు విజ‌య‌వాడ రైల్వే డివిజ‌న్ స్ప‌ష్టం చేసింది.

22643 నెంబ‌ర్ క‌లిగిన యర్నాకుళం-పాట్నా రైలు జ‌న‌వ‌రి 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో న‌డుస్తుంద‌ని పేర్కొంది. 12756 నెంబ‌ర్ క‌లిగిన భావనగర్‌-కాకినాడపోర్ట్ ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో, 12509 నెంబ‌ర్ క‌లిగిన బెంగళూరు-గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23 తేదీల్లో న‌డుస్తుంద‌ని తెలిపింది.

11019 ఛత్రపతి శివాజీ టెర్మినస్‌-భువనశ్వర్ ఈ నెల 29, 31 ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24 తేదీల్లో, 13351 ధన్‌బాద్‌-అల్లపూజ రైలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు, 18111 టాటా- యశ్వంత్‌పూర్ రైలు ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీల్లో న‌డుస్తుంద‌ని వెల్ల‌డించింది.

22837 నంబ‌ర్ క‌లిగిన బెంగళూరు రైలు ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో, 12835 హతియా-బెంగళూరు(ఈ నెల 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీల్లో, 12889 టాటా-బెంగళూరు ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో న‌డుస్తున్న‌ట్లు పేర్కొంది.