వీడిన సానియా..షోయబ్ బంధం
నటి సనాను పెళ్లి చేసుకున్న క్రికెటర్
హైదరాబాద్ – ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ టెన్నిస్ అందాల రాణిగా పేరు పొందిన సానియా మీర్జాకు షాక్ తగిలింది. ఆమె ఏరికోరి పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ ను మనువాడింది. వీరిద్దరికి ముద్దుల కొడుకు కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. మీడియా కోడై కూసింది. కానీ దానిని ఖండించ లేదు సానియా మీర్జా.
శనివారం సంచలన వార్త వెలుగు చూసింది. సానియాను కాదని షోయబ్ మాలిక్ కొంత కాలం నుంచి నటితో దగ్గరి సంబంధం నెరుపుతూ వచ్చారు. సానియా, షోయబ్ మధ్య కొంత వాగ్వావాదం కూడా చోటు చేసుకుంది. తాజాగా తాను నటి సనా జావెద్ ను పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా ఇన్ స్టాలో ప్రకటించాడు క్రికెటర్ షోయబ్ మాలిక్.
భారత టెన్నిస్ రంగంలో రారాణిగా వెలుగొందారు సానియా మీర్జా. షోయబ్ క్రికెట్ లో రాణించాడు. ఈ ఇద్దరు 2010లో వివాహం చేసుకున్నారు. ఐదు నెలల పాటు డేటింగ్ కొనసాగింది వీరిద్దరి మధ్య. షోయబ్ రాను రాను తనను మోసం చేస్తున్నాడని తెలుసుకున్న తర్వాత సానియా మీర్జా దూరం పెట్టినట్టు సమాచారం. 2021లో నటితో సన్నిహితంగా ఉంటూ వచ్చారని, అది ప్రేమ నుంచి పెళ్లి దాకా వెళ్లిందని టాక్.
ఇదిలా ఉండగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక వ్యాఖ్యలు చేసింది. విరిగిన హృదయాలు ఎక్కడికి వెళతాయి..అల్లాను వెతకడానికి అని.