ENTERTAINMENT

సంక్రాంతి వేడుక‌ల్లో మెగా ఫ్యామిలీ

Share it with your family & friends

క‌లిసిక‌ట్టుగా ఫోటో దిగిన కుటుంబం

హైద‌రాబాద్ – సంక్రాంతి పండుగ ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఏపీ, తెలంగాణ‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రీకి పేరు పేరునా భోగి, మ‌క‌ర‌, క‌నుమ పండుగ కంగ్రాట్స్ తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రు ఆయురారోగ్యాల‌తో, సుఖ సంతోషాల‌తో, పాడి పంట‌ల‌తో విల‌సిల్లాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మ‌రో వైపు ఈ కొత్త ఏడాదిలో తెలుగు , భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ప‌రిఢ‌విల్లాల‌ని కోరారు. న‌టీ న‌టులు, సాంకేతిక రంగ నిపుణులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు బాగుండాల‌ని ఆకాంక్షించారు.

ఇదే స‌మ‌యంలో ఆయ‌న ఆస‌క్తిక‌ర విష‌యం పంచుకున్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో అయోధ్య లోని శ్రీ‌రాముడి పునః ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి త‌న‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మెగాస్టార్ తో పాటు రామ మందిరం ట్ర‌స్టు సభ్యులు గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు కూడా ఇన్విటేష‌న్ ఇచ్చారు.