సంక్రాంతి వేడుకల్లో స్మితా
శుభాకాంక్షలు తెలిపిన ఆఫీసర్
హైదరాబాద్ – సంక్రాంతి పర్వదినాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రముఖులు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. ఈ ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు. తాజాగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ , తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సంక్రాంతి పండుగ సందర్బంగా ఏపీ, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
మకర సంక్రాంతి మీ అందరిలో కొత్త వెలుగులు నింపాలని , ప్రతి ఒక్కరికీ ఆ దేవుడు ఆయురారోగ్యాలను, అష్టయిశ్వర్యాలను ప్రసాదించాలని కోరారు. ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విశేషాలను పంచుకుంటారు స్మితా సబర్వాల్ .
ఓ వైపు విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ తాను ప్రజలకు సేవలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. గత సర్కార్ హయాంలో ఆమె మిషన్ భగీరథ, సీఎంఓ కార్యదర్శిగా కూడా పని చేశారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో స్మితా సబర్వాల్ ఉంటుందా లేక సెంట్రల్ సర్వీస్ లోకి వెళుతుందా అన్న అనుమానం వ్యక్తమైంది.
కానీ అనూహ్యంగా ఆమెను లూప్ లైన్ లోకి పంపించారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి పారుదల శాఖలో అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వచ్చాయి.