సంక్షేమ పథకాలు గెలుపు మార్గాలు
ధీమా వ్యక్తం చేసిన సీఎం జగన్ రెడ్డి
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలుపునకు మార్గాలని ధీమా వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలోనే అత్యధికంగా సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయని, ఎవరు ఎన్ని రకాలుగా నిరాధారమైన ఆరోపణలు చేసినా తిరిగి వచ్చేది వైసీపీ సర్కానేనని జోష్యం చెప్పారు.
గతంలో కొలువు తీరిన చంద్రబాబు సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఆరోపించారు. కానీ తాము వచ్చాక అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చేలా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాలుగా పథకాలతో పాటు సామాజిక న్యాయం జరిగేలా తాను కృషి చేశానని ఇంతకన్న ఎక్కువ ఎవరు చేస్తారో చెప్పాలన్నారు.
తమ ఆస్తులను కాపాడు కునేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నారని, వాళ్లు ఇంత కాలం రాష్ట్రంలో ఉండకుండా ఎక్కడ ఉన్నారో చెప్పాలని నిలదీశారు. తాము పాండవ సైన్యమని, వాళ్లది కౌరవ సైన్యమని చివరకు గెలిచేది మేమేనంటూ స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.