సార్లు ఇక ఎమ్మెల్సీలు
అధికారికంగా ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ – ఎట్టకేలకు తెలంగాణ ప్రజల కల సాకారమైంది. సుదీర్ఘ కాలం పాటు ప్రజల కోసం , హక్కుల కోసం పని చేస్తూ వచ్చిన ఆచార్య కోదండరాం రెడ్డితో పాటు సీనియర్ పాత్రికేయుడు మీర్ అమీర్ అలీ ఖాన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఈ మేరకు ఇప్పటికే గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు విన్నవించింది. ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
దీంతో గవర్నర్ కోటా కింద ఆ ఇద్దరు నేతలు శనివారం నుంచి ఎమ్మెల్సీలుగా అధికారికంగా కానున్నారు. ఇక నియామక పత్రాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంది. వీటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇస్తుంది. మొత్తంగా ఎలాంటి ఇబ్బందులంటూ ఉండవు అని చెప్పక తప్పదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో, సకల జనుల సమ్మెను చేపట్టడంలో, అన్ని పార్టీలను సమన్వయం చేయడంలో, ప్రజల హక్కుల కోసం పోరాడటంలో కోదండ రాం రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో సియాసత్ పత్రిక కూడా ముఖ్య భూమికను పోషించింది. హిందూ, ముస్లిం సంస్కృతికి ప్రతిబింబంగా ఉంది తెలంగాణ.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన నిర్బంధానికి గురయ్యారు ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు. కాంగ్రెస్ వచ్చాక వాటికి తెర దించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.