NEWSTELANGANA

తెలంగాణ నుంచి సోనియా బ‌రిలోకి దిగాలి

Share it with your family & friends

కాంగ్రెస్ పార్టీ ఏక‌గ్రీవ తీర్మానం

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. 64 సీట్లు సాధించిన ఆ పార్టీ రెండు నెల‌ల్లో జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది.

టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో కీల‌క భేటీ జ‌రిగింది. ఇందులో ప్ర‌ధానంగా ఏఐసీసీ మాజీ చీఫ్‌, ప్ర‌స్తుత సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీకి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది పార్టీ. రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి మేడం పోటీ చేయాల‌ని ఏక‌గ్రీవంగా మ‌ద్ద‌తు తెలిపారు.

రాష్ట్రంలో 17 లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌కు చెందిన అభ్య‌ర్థులు ప్ర‌స్తుతం ఎంపీలుగా ఉన్నారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి రెండు చోట్ల ఈసారి పోటీ చేస్తే కోడంగ‌ల్ లో గెలుపొంద‌గా కామారెడ్డిలో ఓడి పోయాడు.

ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ల్కాజ్ గిరి ఎంపీ సీటుకు రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. దీంతో ఇది కూడా ఖాళీ అయ్యింది. ఆయ‌న‌తో పాటు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి లు కూడా త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ఈసారి మొత్తం సీట్లు చేజిక్కించు కోవాల‌ని ప్లాన్ వేశారు సీఎం.