తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచి కావాలి

Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో విద్యా విధానంలో కీల‌క‌మైన మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. బుధ‌వారం స‌చివాల‌యంలో తెలంగాణ విద్యా విధానం రూపకల్పనపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం ఉండాల‌న్నారు. భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో నూతన విద్యా విధానం ఉండేలా ప్లాన్ చేయాల‌ని ఆదేశించారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్-2047 విడుదల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం.

విద్యా రంగం సమూల ప్రక్షాళనే త‌మ‌ ధ్యేయం అని స్ప‌ష్టం చేశారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. మౌలిక వసతుల మెరుగుదలపై ఫోకస్ పెడ‌తామ‌ని చెప్పారు. సిలబస్, వనరుల సమీకరణ, అమలుపై స్పష్టత అవసరం అన్నారు. పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక ఆయుధం అని అన్నారు రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామ‌ని, యూనివర్సిటీ వీసీల నియామకాలు పూర్తయ్యాయని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. విద్య అనేది ఖ‌ర్చు కాద‌ని అది రాబోయే త‌రాల‌కు త‌ర‌గ‌ని సంప‌ద‌గా భావించాల‌ని స్ప‌ష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.

  • Related Posts

    చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత‌ అమ‌రావ‌తి : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయ‌ల‌సీమ‌ను కావాల‌ని నాశ‌నం చేశాడంటూ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రజా…

    తెలుగు ప్ర‌జ‌లు సుర‌క్షితంగా ఉండేలా చూడాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *