కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కామెంట్స్
బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు మంత్రి. ప్రజా, సామాజిక ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కర్రలను బహిరంగంగా ప్రదర్శించడంలో పాల్గొంటారని దీని వల్ల విద్యార్థులు, చిన్నారులు , అమాయకులు ఎక్కువగా ప్రభావితం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోరని ఆరోపించారు ఖర్గే.
ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు/ఎయిడెడ్-పాఠశాలల ప్రాంగణాలు, పబ్లిక్ పార్కులు, ముజ్రాయి శాఖకు చెందిన దేవాలయాలు, రాష్ట్ర రక్షిత స్మారక చిహ్నాల ప్రాంగణాలు, ఇతర ప్రభుత్వ స్థలాలలో సమావేశాలు లేదా సంఘ్ నిర్వహించడం వంటి రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అన్ని రకాల కార్యకలాపాలను నిషేధించడానికి చర్యలు తీసుకోవాలని సమాచార సాంకేతిక పరిజ్ఞానం, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించడానికి కారణం ప్రజా, సామాజిక ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని. అక్టోబర్ 4 నాటి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖకు ప్రతిస్పందించారు సీఎం . అయితే ఎలాంటి చర్యలకు సిఫారసు చేయలేదు.






