మెగాస్టార్ మూవీ స‌క్సెస్ డైరెక్ట‌ర్ ఖుష్

Spread the love

త‌న‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింది

గుంటూరు జిల్లా : మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, అందాల తార న‌య‌న‌తార , టీవీకే గ‌ణేష్ కీల‌క పాత్ర‌లు పోషించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సంచ‌లనం రేపుతోంది. విడుద‌లైన 5 రోజుల‌లోనే ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ను సాధించింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను చేశారు. ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా సినీ వ‌ర్గాల విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు రూ. 226 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ చేసింద‌ని అంచ‌నా. చిరంజీవి సినీ కెరీర్ లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రాల‌లో మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ చేరింది. గ‌తంలో ఆయ‌న న‌టించిన సైరా, ఖైదీ నంబ‌ర్ 1, వాల్తేరు వీర‌య్య మూవీస్ రూ. 100 కోట్ల మార్కును దాటాయి. ఇప్పుడు మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మాత్రం రాబోయే రోజుల్లో రూ. 300 కోట్ల‌ను కూడా దాటేస్తుంద‌ని సినీ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ మూవీ బిగ్ స‌క్సెస్ సాధించ‌డంతో చిత్ర బృందం ఫుల్ జోష్ లో ఉంది. ఈ సంద‌ర్బంగా సినిమా విజ‌యోత్స‌వ స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. తాజాగా గుంటూరులో జ‌రిగిన సినీ స‌క్సెస్ మీట్ లో పాల్గొన్నారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మెగాస్టార్ లాంటి మెగా హీరోతో సినిమా చేయాల‌ని క‌ల ఉండేద‌న్నాడు. కానీ ఆ కోరిక ఈ సినిమాతో తీరింద‌న్నాడు. త‌న జీవితంలో మ‌రిచి పోలేని విధంగా సినిమా వ‌చ్చింద‌ని, అదే క్ర‌మంలో అభిమాన దేవుళ్లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ , మెగా స‌క్సెస్ చేశారంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ సినిమా విజ‌యంతో త‌న‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింద‌న్నాడు.

  • Related Posts

    సీఎం జోసెఫ్ విజ‌య్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

    Spread the love

    Spread the loveత్వ‌ర‌లో రిలీజ్ కానున్న జ‌న నాయ‌గ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రానికి నూత‌న సీఎంగా ఎన్నికైన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. త‌ను చివ‌రిసారిగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రంలో భాగంగా సింగ‌పూర్…

    త‌మిళ‌నాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టి స‌న‌మ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *