143 కోట్ల భారతీయులది కావడం ఖాయం
కర్నూలు జిల్లా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ ప్రపంచం నివ్వెర పోయేలా భారత్ ముందంజలో కొనసాగడం ఖాయమన్నారు. రాబోయే 21వ శతాబ్ధం భారత దేశానిదే అవుతుందన్నారు. 143 కోట్ల భారతీయులు గర్వపడే స్థాయికి చేరుకుంటుందన్నారు. విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, రక్షణ రంగాలకు చెందిన చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశామన్నారు మోదీ. గురువారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన నంద్యాల జిల్లాలోని ప్రసిద్ద శైవ పుణ్య క్షేత్రం శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్నారు ప్రధానమంత్రి. ఈ సందర్బంగా మల్లికార్జున స్వామికి అభిషేకం చేశారు. అనంతరం కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ పేరుతో కూటమి సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు నరేంద్ర మోదీ.
ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో కనెక్టివిటి బలోపేతం కావటంతో పాటు పరిశ్రమలను బలోపేతం చేస్తాయని అన్నారు. కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. దేశానికైనా, రాష్ట్రానికైనా ఇంధన భద్రత అవసరం అన్నారు. ప్రస్తుతం 3 వేల కోట్ల విలువైన ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. తద్వారా దేశ ఇంధన సామర్ధ్యం పెరుగుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్ అవుట్ లాంటి విద్యుత్ సంక్షోభాలు వచ్చాయన్నారు. తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే తక్కువే ఉందన్నారు. చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా లేని పరిస్థిత నెలకొంద న్నారు. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ నుంచి మన అవసరాలకు తగినంత ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. 1400 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు దేశంలో ఉందని పేర్కొన్నారు. తగినంత విద్యుత్ దేశ ప్రజలకు లభ్యం అవుతోందన్నారు.






