సామాజిక తెలంగాణ కోసం జ‌నం బాట

ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌

నిజామాబాద్ జిల్లా : తెలంగాణ సాకారం చేయ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించిన ఘ‌న‌త తెలంగాణ జాగృతి సంస్థ అని స్ప‌ష్టం చేశారు సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా ముఖ్య భూమిక పోషించిన విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. త‌న‌కు రాజ‌కీయ ప‌రంగా అద్భుత‌మైన అవ‌కాశం ఇచ్చిన నేల నిజామాబాద్ జిల్లా అని అన్నారు. ఇక్క‌డి నుంచే తాను పార్ల‌మెంట్ స‌భ్యురాలిగా, శాస‌న మండ‌లి స‌భ్యురాలిగా ఎన్నిక‌య్యాన‌ని చెప్పారు. ఆదివారం తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వ‌ర్యంలో జాగృతి జ‌నం బాట‌కు శ్రీ‌కారం చుట్టారు. భారీ ఎత్తున హాజ‌రైన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. త‌ను జీవితాంతం ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను, జిల్లాను గుర్తు పెట్టుకుంటాన‌ని అన్నారు.

తెలంగాణ పున‌ర్ నిర్మాణంలో ప్ర‌తి ఒక్క‌రు భాగ‌స్వాములైనా ఇంకా సాధించాల్సింది చాలా ఉంద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. తెలంగాణ రాష్ట్రం, దాని ప్రజల శ్రేయస్సును నిర్ధారించడంలో తెలంగాణ జాగృతి ఎల్లప్పుడూ ముందంజలో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేయడంలో తెలంగాణ జాగృతి ఉత్ప్రేరకంగా వ్యవహరించిందని చెప్పారు క‌విత‌. ఇవాళ మ‌రో బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింద‌న్నారు. మ‌రోసారి సామాజిక తెలంగాణ కోసం పోరాడేందుకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. అందులో భాగంగానే జాగృతి జ‌నం బాట‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లిసేందుకు తాను వ‌స్తున్నాన‌ని చెప్పారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *