భారీ బండరాయిని తొల‌గించిన హైడ్రా

సంచారం లేక పోవ‌డంతో త‌ప్పిన ప్ర‌మాదం

హైద‌రాబాద్ : మ‌ల్కాజ్ గిరిలోని గౌత‌మ్ న‌గ‌ర్ లో గుట్ట పైనుంచి ఊహించని విధంగా పెద్ద బండరాయి ఉదయం 11 గంటల ప్రాంతంలో పడింది. అదృష్ట వశాత్తూ ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయాన్ని తెలుసుకున్న హైడ్రా DRF, GHMC సిబ్బందితో కలసి బండరాయిని ముక్కలు చేసి పక్కకు తొలగించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన జల్లులు కురుస్తుండడంతో ఈ బండ రాయి కింద మట్టి కరిగి జారి పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మల్కాజిగిరి గౌతమ్ నగర్ లో మల్లికార్జున నగర్లో ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి బండరాయి పడడంతో కిందనే పార్కు చేసి ఉన్న చెత్త తరలించే GHMC ట్రాలీ నుజ్జయ్యింది.

గతంలో ఇక్కడ బండరాళ్లు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. మే నెలలో కురిసిన వర్షాల సమయంలో కూడా బండ రాళ్ళు పడ్డాయి. చెత్త సేకరించిన వారు ప్రమాదకరంగా ఇదే గుట్టపై తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని వుండగా ప్రమాదాన్ని ముందే ఊహించిన హైడ్రా వాటిని ఈ ఏడాది జూలైలో ఖాళీ చేయించింది. లేని పక్షంలో పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు అలాగే ఇక్కడ ప్రతి శనివారం సంత కూడా జరుగుతుందని. స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11 గంటలకు పడిన బండ రాయిని GHMC తో కలిసి హైడ్రా DRF సిబ్బంది రాత్రి 9.30 గంటలకు తొలగించారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *