రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Spread the love

కబ్జాల చెర నుంచి 4 వేల గజాల పార్కుకు విముక్తి

హైదరాబాద్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో 4000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 1985లో 26.9 ఎకరాలపరిదిలో 500 ప్లాట్లతో లేఔట్ వేసిన నాటి భూ యజమానులే ఈ కబ్జాలకు పాల్పడడం ఇక్కడ గమనార్హం. ఇదే విషయమై చౌదరిగూడలోని డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదును హైడ్రా అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేఔట్ వేసినప్పుడు 4 వేల గజాల స్థలాన్ని పార్కుగా చూపించారు. కుటుంబ సభ్యుల్లో ఆముదాల నరసింహ కొడుకు ఆముదాల రమేష్ తప్పుడు డాక్యుమెంట్స్ తో 4 వేల గజాలను 800 గజాల చొప్పున 5 ప్లాట్లుగా కులకర్ణి అనే వ్యక్తికి అమ్మేసినట్టు తేలింది.

కులకర్ణి అనే వ్యక్తి వాటిని 200 గజాల చొప్పున 20 ప్లాట్లుగా చేసి రాజేష్, సోమాని తో పాటు పలువురికి అమ్మేశారు. ఈ విషయమై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టును కూడా కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఆశ్రయించారు. ఇలా దశాబ్దాలుగా పరిష్కారం కానీ సమస్యతో గత నెల సెప్టెంబరులో హైడ్రాను ప్రతినిధులు ఆశ్రయించారు. విచారణ పూర్తి చేసి పార్కు స్థలంగా నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు శుక్రవారం ఆక్రమణలు తొలగించారు. 4 వేల గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డు లు ఏర్పాటు చేశారు. దీంతో పార్కు కబ్జాకు తెరపడింది. ఇప్పుడు కాలనీ ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా నిషేధం

    Spread the love

    Spread the loveకర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. గ‌త కొంత కాలంగా పిల్ల‌ల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది సోష‌ల్…

    స్పీక‌ర్ అయ్య‌న్న‌ను క‌లిసిన ప‌వ‌న్ కళ్యాణ్

    Spread the love

    Spread the loveఅభివృద్ధి నివేదిక అందజేసిన డిప్యూటీ సీఎం అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని శుక్రవారం స్పీకర్ చాంబర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *