రాష్ట్రం బాగుండాలని దేవతను కోరుకున్నా
కరీంనగర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆమె జాగృతి జనం బాట పట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ జి్లాలో పర్యటించారు. ఆయా ప్రాంతాలను సందర్శించారు. రైతులను పరామర్శించారు. ఇప్పటికే మొంథా తుపాను కారణంగా తీవ్రంగా పంటలు నష్ట పోయిన బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో పేరు పొందిన బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మ వారిని దర్శించుకున్నారు కవిత. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు జాగృతి అధ్యక్షురాలు.
నగరానికి విచ్చేసిన కవితక్కకు పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలికారు. జాగృతి శ్రేణులు, బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు. అనంతరం భారీ ర్యాలీ గా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు కల్వకుంట్ల కవిత. అనంతరం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు అంజలి ఘటించారు. అనంతరం తెలంగాణ జాతిపిత, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆచారి సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. రాష్ట్రంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మైసమ్మ అమ్మ వారిని ప్రార్థించడం జరిగిందన్నారు.







