భార‌తీయ ఆత్మ గీతం వందేమాత‌రం

చిత్తూరు జిల్లా పోలీసుల ఆలాప‌న

చిత్తూరు జిల్లా : జాతీయ గీతం వందే మాత‌రం ర‌చించి నేటికి 150 ఏళ్ల‌వుతున్న సంద‌ర్బంగా చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఘ‌నంగా గీతాన్ని ఆలాపించారు. దేశం ప‌ట్ల ఉన్న త‌మ భ‌క్తిని ఈ విధంగా చాటుకున్నారు. వందేమాతరం అనేది భారతీయుల గుండెల్లో ఎప్పటికీ ఆరని జ్యోతి అన్నారు. స్వాతంత్ర స్ఫూర్తికి మూలం వందేమాతరం, మన ఐక్యతకు ప్రతీక వందేమాతరం అని పేర్కొన్నారు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, ఇంచార్జ్ అడ్మిన్ ఎస్.ఆర్.రాజశేఖర్ రాజు. చిత్తూరు పట్టణములోని గాంధీ కూడలి వద్ద జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని దేశభక్తి గీతం వందేమాతరంను ఏకస్వరంగా ఆలాపించారు.

ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడారు. వందేమాతరం అనేది దేశభక్తి నినాదం మాత్రమే కాదు, అది మన మనసుల్లో దేశమంటే ఏమిటో గుర్తుచేసే శక్తి అని అన్నారు. వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదు, అది భారతీయుల మనసుల్లో దేశభక్తిని మేల్కొలిపిన ఆత్మీయ నినాదం అని పేర్కొన్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర‌ ఉద్యమంలో కోట్లాది భారతీయులలో ఆత్మ విశ్వాసాన్ని, త్యాగస్ఫూర్తిని నింపిందని చెప్పారు. వందేమాతరం అనేది మన దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, సేవాస్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. ఈ రోజు విద్యార్థులు, పోలీసులు, ప్రజలు ఒకే గళంలో ఆలపించడం ద్వారా మన దేశ ఏకతను, ఐకమత్యాన్ని ప్రతిబింబించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *