రేవంత్ రెడ్డీ ప‌నికొచ్చే ప‌ని ఏదైనా చేశావా ..?

Spread the love

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మందిని తొక్క‌డం, మాట త‌ప్ప‌డం, మోసం చేయ‌డం రేవంత్ రెడ్డి క్యారెక్ట‌ర్ అంటూ ఫైర్ అయ్యారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఒక బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి దిగ‌జారుడు మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. త‌ను సీఎంన‌న్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడ‌ని , దీనిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. జూబ్లీహిల్స్ లో ఓడి పోతున్నాన‌న్న భ‌యం త‌న‌లో మొద‌లైంద‌న్నారు. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఇంత వ‌ర‌కు చేసిన పాపాన పోలేద‌న్నారు హ‌రీశ్ రావు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ పేరును సచివాల‌యానికి పెడితే త‌ట్టుకోవ‌డం లేద‌న్నారు. ఆయ‌న పేరు ఉంద‌ని అక్క‌డికి వెళ్ల‌డం కూడా మానేశాడ‌ని, ఇక ఈయ‌న ఏం పాల‌న సాగిస్తాడ‌ని ప్ర‌శ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి స‌వాల్ విసిరారు మాజీ మంత్రి . దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం అని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో క‌లిసి పోయాయ‌ని, ఆ విష‌యం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతార‌న్నారు. ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేద‌ని ప్ర‌శ్నించారు. అస‌లు రేవంత్ రెడ్డిని ఎవ‌రు కాపాడుతున్నారో తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.

  • Related Posts

    న‌ల్ల‌గొండ అభివృద్ది కోసం మ‌రో రూ. 2 వేల కోట్లు

    Spread the love

    Spread the loveతీసుకు వ‌చ్చేందుకు కృషి చేస్తాన‌న్న కోమ‌టి రెడ్డి న‌ల్ల‌గొండ జిల్లా : న‌ల్ల‌గొండ జిల్లాకు ఎంత చేసినా త‌క్కువేన‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇప్ప‌టికే ప‌ట్ట‌ణ అభివృద్ది కోసం…

    టెక్నాల‌జీతో అనుసంధానం ప‌రిశ్ర‌మ‌ల‌కు అందలం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీలో టెక్నాల‌జీకి ప్రాధాన్య‌త ఇస్తూ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు స‌హ‌కారం అందిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తున్నార‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *