డిప్యూటీ సీఎంను క‌లిసిన ఎస్పీ తుషార్ డూడి

రెండు రోజుల పాటు తిరుప‌తిలోనే ప‌వ‌న్ మ‌కాం

చిత్తూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ఎస్పీ తుషార్ డూడి. ఆయ‌న శ‌నివారం , ఆదివారం తిరుప‌తి, చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇవాళ మంగ‌ళం లోని అట‌వీశాఖ ప‌రిధిలోని ఎర్ర చంద‌నం గోడౌన్ల‌ను ప‌రిశీలించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశానికి హాజర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఉప ముఖ్య‌మంత్రికి పూల గుచ్ఛం ఇచ్చి సాద‌ర స్వాగ‌తం తెలిపారు. అనంత‌రం చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ముసలి మడుగు ఎలిఫెంట్ క్యాంప్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా అంతటా పటిష్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశామ‌న్నారు ఎస్పీ తుషార్ డూడి. ముఖ్యంగా మార్గమధ్యంలో పోలీసు పికెటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సీసీటీవీ పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాగే, పర్యటనలో ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, పోలీస్ అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వెల్ల‌డించారు. అంత‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎనిమిది గో డౌన్ల‌ను ప‌రిశీలించారు. వెంట‌నే పూర్తి నివేదిక‌ను అందించాల‌ని ఆదేశించారు.

  • Related Posts

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *