మ‌హిళ‌ల క్రికెట్ భ‌విష్య‌త్తుకు ఢోకా లేదు

Spread the love

స్టార్ ఉమెన్ క్రికెట‌ర్ జెమీమా రోడ్రిగ్స్

ముంబై : ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తులో భార‌త మ‌హిళా క్రికెట్ మ‌రింత పుంజుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. త‌మ గెలుపు వెనుక క‌ఠోర శ్ర‌మ దాగి ఉంద‌న్నారు. ఈ క్రెడిట్ అంతా త‌మ‌ది కాద‌ని, త‌మ‌ను త‌యారు చేసిన‌, విశ్వ విజేత‌లుగా నిలిపేందుకు స‌హాయం చేసిన త‌మ కోచ్ అమోల్ మ‌జుందార్ ది అని పేర్కొన్నారు. త‌మ జీవితంలో మ‌రిచి పోలేనిది ఈ విజ‌యం అన్నారు. అంతే కాకుండా భార‌త దేశ రాష్ట్ర ప‌తి ముర్ము, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన ప్ర‌శంస‌లు త‌మ‌ను మ‌రింత ఆడేలా, ఉత్సాహం పొందేలా చేశాయ‌న్నారు జెమీమా రోడ్రిగ్స్.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా జియో హాట్ స్టార్ లో ప్ర‌సారం అయిన భార‌త్, ద‌క్షిణాఫ్రికా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్ ను 455 మిలియ‌న్ల మంది వీక్షించ‌డం మ‌రింత త‌మ‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింద‌న్నారు. రాబోయే రోజుల్లో త‌మ‌పై మ‌రింత బాధ్య‌త పెంచేలా చేసింద‌న్నారు ఈ క‌ప్ గెల‌వ‌డంతో. 143 కోట్ల మంది భార‌తీయుల ఆశ‌ల‌కు తాము ప్ర‌తిరూపంగా మార‌డం జీవితంలో మ‌రిచి పోలేమ‌న్నారు జెమీమా రోడ్రిగ్స్.
నేను ఇప్పటికీ ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనన‌ని అన్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికీ తాము క‌ప్పు గెలిచామంటే న‌మ్మ‌బుద్ది కావ‌డం లేద‌న్నారు. ఇది క‌ల కాదు నిజ‌మ‌ని ఇప్పుడు తెలుస్తోంద‌ని చెప్పారు స్టార్ క్రికెట‌ర్.

  • Related Posts

    ఇంగ్లండ్ రాణిస్తుందా ఇండియా గెలుస్తాందా

    Spread the love

    Spread the loveటి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2వ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ నేడు ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు భార‌త జ‌ట్టుపైనే ఉన్నాయి. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకునేందుకు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో…

    ఫిన్ అలెన్ విధ్వంసం దక్షిణాఫ్రికా ప‌రాజ‌యం

    Spread the love

    Spread the loveఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన కీవీస్ బ్యాట‌ర్ కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు న్యూజిలాండ్ కు చెందిన క్రికెట‌ర్ ఫిన్ అలెన్. కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *