రాజస్థాన్ రాయల్స్ చెన్నై మధ్య బిగ్ డీల్
చెన్నై : వచ్చే ఏడాది 2026లో జరగబోయే ఐపీఎల్ లో అందరి కళ్లు మంగళవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పైనే ఉన్నాయి. ప్రధానంగా తనను ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ సైతం ప్లాన్ చేశాయి. ఇప్పటి వరకు అత్యధిక కాలం సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడాడు. కెప్టెన్ గా ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈసారి జరిగిన ఐపీఎల్ లో తనకు రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కు మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దీంతో తనను రిలీజ్ చేయాలని కోరాడు. తన బేస్ ధర రూ. 18 కోట్లు. అంతకు ఎక్కువ చెల్లించేందుకు పలు జట్ల యాజమాన్యాలు పోటీ పడ్డాయి. తను కెప్టెన్ గా, బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తను ఏ జట్టుకు వెళ్లినా ఆ జట్టుకు బిగ్ అస్సెట్ అవుతుంది.
ఈ తరుణంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల యాజమాన్యాల మధ్య ట్రేడ్ డీల్ కొనసాగుతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే మేనేజ్ మెంట్ స్వంతంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయం పైనే ఉంటుంది. సో..తనకు శాంసన్ అంటే ఇష్టం కూడా. పలుమార్లు ఈ ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణలు చోటు చేసుకున్నాయి. శాంసన్ ను ఇచ్చేందుకు ఓకే చెప్పిన రాజస్తాన్ రాయల్స్ మరో మెలిక కూడా పెట్టినట్లు టాక్. తను మీకు ఇస్తే మాకు రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరన్ కూడా కావాలని కోరినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ కు సంజూ శాంసన్ ధోనీ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు.






