Friday, 16 October 2026

ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

newsseals-lalitModi

ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా ఆడేవారు లేదా చూసేవారని పేర్కొన్నారు. ఆయ‌న చిట్ చాట్ సంద‌ర్భంగా ఇండియాలో కొన‌సాగుతున్న ఐపీఎల్, ఇత‌ర టోర్నీల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. తాజాగా ల‌లిత్ మోడీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి క్రికెట్ వ‌ర్గాల‌లో.

అందుకే ఐపీఎల్‌కు ఆ సమయం దొరికిందన్నారు. కానీ ఈ రోజు ఐపీఎల్ బీసీసీఐకి అతిపెద్ద ఆదాయ వనరుగా మారింద‌న్నారు. ఈ కీల‌క స‌మ‌యంలో అది అత్యుత్తమ విండోను ఎందుకు తీసుకోకూడదు? అని ప్ర‌శ్నించారు ల‌లిత్ మోడీ. ప్రతి లీగ్ తనకంటూ ఒక విండోను సృష్టించుకుందని చెప్పారు. బీబీఎల్, ది హండ్రెడ్, ఈపీఎల్, సీపీఎల్, ఎస్ఏ20, చివరికి యూఎస్ఏ కూడా ఈ ఫార్మాట్ ను కొన‌సాగిస్తోంద‌ని తెలిపారు. ఐపీఎల్ కూడా అదే పని ఎందుకు చేయకూడదని అన్నారు ల‌లిత్ మోడీ. డబ్బు ఇక్కడే ఉంది కాబట్టి ఆటగాళ్లు వస్తారు. ప్రతి ఒక్కరినీ వారి వారి విండోలో ఆడనివ్వాల‌ని సూచించారు. ఐపీఎల్‌ను సాధ్యమైనంత ఉత్తమమైన సమయంలో షెడ్యూల్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *