డిసెంబ‌ర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్

ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : పెట్టుబ‌డుల‌ను సాధించ‌డంలో ఓ వైపు ఏపీ స‌ర్కార్ టాప్ లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే విశాఖ వేదిక‌గా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సును స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించింది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ స‌ర్కార్ కూడా సిద్ద‌మైంది స‌మ్మిట్ ను నిర్వహించేందుకు . ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఆయా విభాగాల‌కు చెందిన ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్బంగా దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ లో నిర్వహించబోయే Telanaga Rising Global Summit- 2025 పై పూర్తిగా దృష్టి సారించాల‌ని ఆదేశించారు. డిసెంబర్ 9 న Telanga Rising-2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది తెలంగాణ భవిష్యత్ కు రోడ్ మ్యాప్ కానుంద‌న్నారు. ఈ డాక్యూమెంట్ దేశ, విదేశీ పెట్టుబడిదారులకు ఒక మార్గదర్శక పత్రంలా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. శాఖల వారీగా పాలసీలకు సంబంధించి సమ్మిట్ లో ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లను సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం. ఈ గ్లోబల్ సమ్మిట్ కు వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానాలు, ఇతర ఏర్పాట్ల పై సమీక్షలో చర్చించారు.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *