రూ. 1201 కోట్ల‌తో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులు

వ‌ర్చువ‌ల్ గా శంకుస్థాప‌న చేసిన సీఎం

విశాఖ‌ప‌ట్నం : ఏపీకి పెట్టుబ‌డుల వెల్లువ కొన‌సాగుతూనే ఉంది. విశాఖ వేదిక‌గా నిన్న ప్రారంభ‌మైన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు నేటితో ముగుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు భారీ ఎత్తున కంపెనీలు ఏపీ స‌ర్కార్ తో ఎంఓయూ చేసుకున్నాయి. దిగ్గ‌జ కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వ‌చ్చాయి. శ‌నివార విశాఖ- 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, ఆ సంస్థ కార్పోరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నాతో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్. ఇదిలా ఉండ‌గా రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్ సంస్థ‌.

సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు శంకుస్థాప‌న చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తుంద‌న్నారు. అంతే కాకుండా అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయ‌నుంద‌ని ప్ర‌క‌టించారు సీఎం . మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు రేమాండ్ సంస్థ క‌ల్పించ‌నుంద‌ని చెప్పారు.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *