ఇంజ‌నీర్లు కొత్త టెక్నాల‌జీపై దృష్టి సారించాలి

పిలుపునిచ్చిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : ఇంజ‌నీర్లు న‌గ‌ర అభివృద్ధిలో కీల‌క‌మైన పాత్రను పోషిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి నీటి వనరుల కోసం ఎంతో కృషి చేసిన ఇంజనీర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ప్ర‌తి ఏటా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంజ‌నీర్స్ డేను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ లోని ఖైర‌తాబాద్ లోని శ్రీ మోక్ష‌గుండం విశ్వేశ్వ‌రయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ భ‌వ‌నంలో ఏర్పాటు చేసిన కార్య‌క్రమానికి హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా ఇంజ‌నీర్ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. తెలంగాణ ఇరిగేషన్ డే సందర్భంగా ఇంజనీర్లను అవార్డులతో సత్కరించు కోవడం సంతోషంగా ఉందన్నారు. ఐఈఐ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్ ను అభినందించారు ఏవీ రంగ‌నాథ్. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ చేపడుతున్న పనులకు గాను ఎ.వి. రంగనాథ్ కి ఐఈఐ తరఫున ప్రత్యేక అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఈఐ కౌన్సిల్ మెంబర్ ఎస్.సత్యనారాయణ, డాక్టర్ రంగారెడ్డి, చీఫ్ సైన్స్ట్ హెచ్.వి.ఎస్. సత్యనారాయణ, ఐఈఐ సెక్రటరి మర్రి రమేష్, ఈ వెంట్ కన్వీనర్ టి.వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *