పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఎండీ నారా భువనేశ్వరి శుక్రవారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆమె ఆయా గ్రామాలలో తిరిగారు. అక్కడి ప్రజలను కలుసుకున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బాగాంధీ పాఠశాలలను సందర్శించారు. అక్కడే ఉంటూ చదువుకుంటున్న పేద విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వారికి ధైర్యం చెప్పారు. చదువు కోవాలని, విద్య ఒక్కటే మనకు గౌరవాన్ని తీసుకు వస్తుందన్నారు.
ఇదిలా ఉండగా ఇవాళ కుప్పం నియోజకవర్గంలో.ఇ తుమ్మిసి పెద్ద చెరువులో జలహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నారా భువనేశ్వరి. కుప్పంతో పాటు రాష్ట్రంలో ఉన్న రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. వ్యవసాయం కీలకమైన రంగమని, రైతులు బాగుంటేనే మనం బాగుంటామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా కూటమి సర్కార్ పని చేస్తోందని అన్నారు నారా భువనేశ్వరి.





