గంగ‌పుత్రుల జీవ‌నోపాధికి కృషి చేస్తాం

Spread the love

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీలో తీర ప్రాంతాల‌ను న‌మ్ముకుని జీవ‌నం సాగిస్తున్న గంగ‌పుత్రుల‌కు తీపి క‌బురు చెప్పారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. వారి భ‌ద్ర‌త‌కు ఎలాంటి ఢోకా లేద‌న్నారు. భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే టైగర్ రొయ్య పిల్లలను కూడా తీర ప్రాంతాల్లో విడిచిపెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. మత్స్య సంపదను పెంపొందించడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగు పర్చేందుకు మత్స్యశాఖ సహకారంతో చర్యలు చేపడుతున్నాం అన్నారు. తీర ప్రాంత మత్స్యకారులు ఇప్పటి వరకు 12 నాటికల్ మైళ్ల దూరం వరకు మాత్రమే వేటాడే అవకాశం ఉంద‌న్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పరిధిని 200 నాటికల్ మైళ్ల వరకు విస్తరించిందన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. డీప్ సీ ఫిషింగ్ ద్వారా మత్స్యకార సోదరులు మంచి ధర లభించే టూనా చేపలను పట్టుకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు .

ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా కోస్టల్ రీజైలెన్స్ స్కీమ్ కింద కోనపాపపేటకు రూ. 2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో తుపాను లాంటి విపత్తుల నుంచి తీర ప్రాంత గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు వీలుగా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామ‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ కమ్యూనిటీ హాళ్లలో ఆర్.ఒ. వాటర్ ప్లాంట్లు, చేపలు ఎండ బెట్టుకునేందుకు వీలుగా మూడు ఫిష్ డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్ నిర్మించనున్నాం అన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులను సముద్రంలో ట్రాక్ చేసేందుకు వీలుగా జీపీఎస్ సిస్టం, మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు ఐస్ బాక్సులు ఏర్పాటు చేయబోతున్నామ‌ని తెలిపారు.

తీర ప్రాంత మత్స్యకారులకు వేటతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపైనా దృష్టి సారించాం అన్నారు డిప్యూటీ సీఎం. మత్స్యకారుల్లోని అద్భుతమైన ఈత సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ కేరళ తరహాలో తీర ప్రాంత పర్యటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. స్పీడ్ బోటింగ్, స్కూబా డైవింగ్ తదితర జల క్రీడల్లో మత్స్యకార యువతకు శిక్షణ ఇప్పించడం ద్వారా మన రాష్ట్ర తీర ప్రాంతాలను టూరిజం హాట్ స్పాట్లుగా తీర్చిదిద్దనున్నాం అన్నారు. అందుకోసం కాకినాడ తీర ప్రాంతం నుంచి కొంత మంది మత్స్యకారులను కేరళ తీసుకువెళ్లి అక్కడ మత్స్యకారులు నిర్వహిస్తున్న ఎకో టూరిజం స్పాట్ల వద్ద శిక్షణ ఇవ్వనున్నాం. చెన్నై హార్బర్ సమీపంలోని తిరువత్రియుర్ కుప్పం తీరంతో విజయవంతంగా నిర్వహిస్తున్న కృత్రిమ రీఫ్ కల్చర్ సందర్శనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం.

  • Related Posts

    బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీపీసీసీ నేత జ‌గ్గారెడ్డి హైద‌రాబాద్ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను బ‌తికి ఉన్నంత వ‌ర‌కు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నంటూ ప్ర‌క‌టించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు.…

    క్లీన్ ఎనర్జీ దిశ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

    Spread the love

    Spread the loveఇందులో పాలు పంచుకోవ‌డం ఆనందంగా ఉంది అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భవిష్యత్తు కోసం ప్రపంచం పరిశుభ్రమైన, మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను చురుగ్గా అన్వేషిస్తోందని అన్నారు. గ్రీన్ అమ్మోనియా అటువంటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *