సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ

Spread the love

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా : అన్నార్థుల‌, విద్యార్థుల ఆక‌లిని తీర్చుతోంది అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దానం చేస్తోంది. ప్ర‌భుత్వంతో క‌లిసి ఒప్పందం చేసుకుంది. ప‌లు చోట్ల సెంట్ర‌లైజ్డ్ క‌మ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు సీఎం. ఈ సంద‌ర్బంగా నిర్వహించనున్న మిడ్ డే మీల్స్ కిచెన్ ( సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. రాబోయే రోజుల్లో కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని రోల్ మోడ‌ల్ గా తీర్చిదిద్దుతాన‌ని ప్ర‌క‌టించారు. రూ. 103 కోట్ల విఇలువ చేసే అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, భూమి పూజ చేయ‌డం మంత్రుల‌తో క‌లిసి ఆనందంగా ఉంద‌న్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ నోయిడాగా కోడంగ‌ల్ ను తీర్చుతాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి. ల‌క్ష‌లాది మందికి ఇది ఆక‌లిని తీర్చ‌డం ఖాయ‌మ‌న్నారు. రైల్వే ప్రాజెక్టు ప‌నులు కూడా ప్రారంభం అవుతాయ‌ని అన్నారు.

  • Related Posts

    చంద్రబాబు నాయుడు హీరో జగన్ విలన్

    Spread the love

    Spread the loveరాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : రాష్ట్రంలో వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల మనస్సుల్లో హీరోగా నిలిచారని, రాష్ట్ర పతనాన్ని…

    కూట‌మి స‌ర్కార్ దుబారాకు అంతులేదు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేద‌న్నారు.మోడీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *