ఎయిరో స్పేస్ సెంట‌ర్ తో భారీగా ఉద్యోగాలు

Spread the love

ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఎయిరో స్పేస్ సెంట‌ర్ ఏర్పాటు కావ‌డం వ‌ల్ల భారీగా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సాఫ్రన్ కంపెనీ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంద‌ని చెప్పారు.పెట్టుబడులను ఆహ్వానించడం, పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంభిస్తోందని అన్నారు. తెలంగాణ అమలు చేస్తోన్న ఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలిచింద‌న్నారు. ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఎయిరోస్పేస్ పార్కులు, ఎస్ఈజెడ్‌లు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించాయని అన్నారు.

ఎయిరోస్పేస్ రంగంలో గతేడాది ఎగుమతులు రెట్టింపయ్యాయని చెప్పారు రేవంత్ రెడ్డి. గడిచిన 9 నెలల కాలంలో ఎగుమతులు 30 వేల కోట్లకు పైగా చేరుకుని, మొదటిసారి ఫార్మా ఎగుమతులను అధిగమించడం గమనార్హం. ఎయిరోస్పేస్ రంగంలో తెలంగాణ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అవార్డును పొందిందన్నారు.రాష్ట్రంలో నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విమానాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంద‌న్నారు సీఎం. నైపుణ్యతను మెరుగు పరచడానికి టాటా టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దామ‌ని తెలిపారు.

  • Related Posts

    టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థ‌లం క‌బ్జా

    Spread the love

    Spread the loveఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థ‌లాన్ని క‌బ్జా చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

    స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్ర‌మ‌దానం

    Spread the love

    Spread the loveనిమ్మ‌ల రామానాయుడు ప‌లువురికి ఆద‌ర్శ‌ప్రాయంపశ్చిమగోదావరి జిల్లా : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ప‌లువు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా మారారు. ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *