ఇండియాలో 2030 కామ‌న్వెల్త్ గేమ్స్

Spread the love

బిడ్డింగ్ లో ఐఓసీ పై మొగ్గు చూపారు

న్యూఢిల్లీ : భార‌త్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కామ‌న్వెల్త్ గేమ్స్ నిర్వ‌హించేందుకు గాను ప్ర‌పంచ వ్యాప్తంగా పోటీ ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు కామ‌న్వెల్త్ గేమ్స్ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశంలో 2030 కామ‌న్వెల్త్ గేమ్స్ ను నిర్వ‌హించేందుకు ఇండియాకే ఇవ్వాల‌ని ఓట్లు వేశాయి స‌భ్య దేశాలు. ఈ సంద‌ర్బంగా రాబోయే కామ‌న్వెల్త్ గేమ్స్ నిర్వ‌హ‌ణ కోసం అంత‌ర్జాతీయ స్టేడియంగా గుర్తింపు పొందిన భార‌త దేశంలోని గుజ‌రాత్ అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియంను ఎంపిక చేశారు. ఇండియాకు అరుదైన బిడ్ ద‌క్క‌డంతో స్పందించారు భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చాలా సంతోషంగా ఉంద‌న్నారు మోదీ. త‌న‌కు చెప్ప‌లేని ఆనందం క‌లిగింద‌ని పేర్కొన్నారు.

భార‌త దేశం అన్ని రంగాల‌లో ముందుకు వెళుతోంద‌ని, ఎన్నో దేశాలు 2030 లో నిర్వ‌హించే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కామ‌న్వెల్త్ గేమ్స్ నిర్వ‌హించేందుకు పోటీ ప‌డ్డాయ‌ని, కానీ భార‌త్ ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్ని వేల కోట్లు అయినా ప‌ర్వాలేదు తాము కామ‌న్వెల్త్ క్రీడ‌ల పోటీల‌ను నిర్వ‌హించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నామ‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి. చివ‌ర‌కు తాము చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింద‌న్నారు. ఈ మేర‌కు అన్ని స‌భ్య దేశాలు త‌మ విలువైన ఓటు హ‌క్కును భార‌త్ కే ప్రాతినిధ్యం క‌లిగించేలా చేశాయ‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా పాల్గొన్న‌, ఓటు వేసి మ‌ద్ద‌తు తెలిపిన స‌భ్య దేశాల‌కు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

  • Related Posts

    త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లోనే మ్యాచ్ లు ఆడుతాం

    Spread the love

    Spread the loveఐసీసీకి స్ప‌ష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా తాము ఇండియాలో జ‌రిగే కీల‌క మ్యాచ్ ల‌ను…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 బ‌రువు 6,175 కిలోలు

    Spread the love

    Spread the love18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ త‌యారీ న్యూఢిల్లీ : అమెరికా వేదిక‌గా ఈ ఏడాది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్స‌ర్ చేస్తోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *