మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్ ప‌నితీరు సూప‌ర్

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్

హైద‌రాబాద్ : వ‌ర్షాల స‌మ‌యంలో మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్ ప‌నితీరు అద్భుతం అని ప్ర‌శంస‌లు కురిపించారు హైడ్రా క‌మిష‌నర్ ఏవీ రంగ‌నాథ్‌. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల వ‌ల్ల క్లౌడ్‌బ‌ర‌స్ట్‌లు చాలాసార్లు సంభ‌వించాయని అన్నారు. ఒకే రోజు 10 నుంచి 18 సెంటీమీట‌ర్లు వ‌ర్షం ప‌డిన సంద‌ర్భాలు అనేకం ఈ వ‌ర్షాకాలం చ‌వి చూశామ‌ని తెలిపారు కాని మీరంతా మ‌న‌సుపెట్టి ప‌ని చేస్తే ఫ‌లితాలు ఎలా ఉంటాయో నిరూపించారని కొనియాడారు. అందుకే ఒక్క అభినంద‌న స‌మావేశంలా కాకుండా వ్య‌క్తిగ‌తంగా ఉన్న‌త శిఖ‌రాల‌కు అన్ని విధాల‌ ఎదిగేలా వ్య‌క్తిత్వ వికాసానికి కూడా హైడ్రా ప్ర‌య‌త్నం చేసింద‌న్నారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఈ క్ర‌మంలోనే ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌రైన జీవన విధానాలను అల‌వ‌ర్చుకునే విధంగా వ్య‌క్తిత్వ వికాస త‌ర‌గ‌తులు కూడా నిర్వ‌హించామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా వ్య‌క్తిత్వ‌, ఆర్థిక వికాస నిపుణులు వంగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఎం. న‌ర్సింగ్‌, చిల్లం చెట్టి గ‌ణేష్‌ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ మెమొంటోలు అంద‌జేసి స‌న్మానించారు.

మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్ (ఎంఈటీ)ల‌లో ఉత్త‌మంగా ప‌ని చేసిన 30 మందికి ప్ర‌శంసా ప‌త్రం, బ‌హుమ‌తిని ఏవీ రంగ‌నాథ్‌ అంద‌జేశారు. అలాగే శాలువ‌తో స‌న్మానించారు. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాలతో పాటు.. ఊళ్ల నుంచి వ‌చ్చిన వారు ఈ వ‌ర్షాకాలం ఎంఈటీలో భాగ‌స్వామ్య‌మై గొప్ప సేవ‌లందించార‌ని.. నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేశార‌ని క‌మిష‌న‌ర్ కొనియాడారు. ఈ ఏడాది ఎంతో అనుభ‌వం గ‌డించాం. వ‌చ్చే ఏడాది మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా వ‌ర్షాకాలం ప‌ని చేసేందుకు ఈ అనుభ‌వం ఎంతో దోహ‌దం చేస్తోంది. భారీ వ‌ర్షాలు ప‌డితే ఏ ప్రాంతాలు నీట మునుగుతాయి, ఇందుకు గ‌ల కార‌ణాలు ఏంటి ఇలా అన్నిటి పైనా మెట్ టీమ్‌ల‌తో పాటు.. డీఆర్ ఎఫ్‌, ఎస్ ఎఫ్‌వోల‌కు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న మొద‌టి ఏడాది వ‌చ్చింద‌న్నారు. ఈ క్ర‌మంలోనే అమీర్‌పేట‌లో నాలాల‌ను పూడిక తీసి వ‌ర‌ద ముప్పు త‌ప్పించాం అన్నారు. అలాగే ప్యాట్నీ నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి 25 కాల‌నీలు, బ‌స్తీల‌కు వ‌ర‌ద ముప్పు లేకుండా చేశామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు.

  • Related Posts

    ఆరు నూరైనా పాల‌మూరును అభివృద్ది చేస్తా

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల‌మూరు జిల్లా : ఆరు నూరైనా పాల‌మూరును అభివృద్ది చేసి తీరుతానంటూ ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లి లో…

    బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీపీసీసీ నేత జ‌గ్గారెడ్డి హైద‌రాబాద్ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను బ‌తికి ఉన్నంత వ‌ర‌కు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నంటూ ప్ర‌క‌టించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *