Sunday, 18 October 2026

20 నుంచి తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్

newsseals-MinisterSSavitha

ప్ర‌క‌టించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాబోయే ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకుని తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎగ్జిబిషన్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది ప్రజలు తిరుపతికి తరలొస్తారన్నారు. ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల 20 నుంచి జనవరి పదో తేదీ వరకూ 22 రోజుల పాటు చేనేత, హస్త కళల ఎగ్జిషన్ నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేపట్టాలని చేనేత, లేపాక్షి అధికారులను మంత్రి సవిత ఆదేశించారు.

ఇదిలా ఉండ‌గా వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లేపాక్షి వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి సవిత వెల్ల‌డించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. కడపలో జరిగే లేపాక్షి ఉత్సవాల్లో వచ్చే నెల 11వ తేదీన తాను పాల్గొనబోతున్నట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో నిర్వహించే లేపాక్షి వారోత్సవాలు ఘనంగా జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చేనేత, లేపాక్షి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *