డిసెంబర్ 6వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను నిర్వహించనున్నారు.డిసెంబర్ 1 వ తేదీన మక్తల్‌లో, 2 వ తేదీన కొత్తగూడెంలో, 3 న హుస్నాబాద్‌లో, 4 న ఆదిలాబాద్‌లో, 5 వ తేదీన నర్సంపేటలో, 6 వ తేదీన దేవరకొండలో ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటిల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో సంబంధిత ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ హాజరవుతారు.
ఆ తర్వాత డిసెంబర్ 7 వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతారు. డిసెంబర్ 8, 9 వ తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతితో పాటు వివిధ దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులు, చైర్మన్లు, సీఈఓలు, కన్సల్టెంట్స్ పాల్గొంటారు. డిసెంబర్ 13 న ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొనే ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఫుట్‌బాల్ మ్యాచ్‌తో ఉత్సవాలు ముగుస్తాయి.





