ప్ర‌జా పాల‌న‌లో రైత‌న్న‌లు ప‌రేషాన్ : హ‌రీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న మాజీ మంత్రి

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. ప్ర‌జా పాల‌న పేరుతో రైతుల‌ను న‌ట్టేట ముంచార‌ని ఆరోపించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా రైతుల‌తో మాట్లాడారు. రెండు లారీల సోయాబిన్ కొంటే అందులో 60 క్వింటాళ్లను వాపస్ పంపించార‌ని ఆరోపించారు. నారాయణఖేడ్‌లో అయినా రాష్ట్రంలో అయినా మక్కలు, సోయాబీన్ పంట కొని నెల రోజులు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయ‌లేదన్నారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్ప‌డం పూర్తిగా మోసం చేయ‌డమేన‌ని పేర్కొన్నారు. ముల్లకర్ర పట్టి పొడిచినా ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా పోయింద‌న్నారు.

రాష్ట్రంలో సోయాబీన్ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. కొనుగోలు చేయడం లేదని, కొన్న పంటను కూడా వాపస్ పంపిస్తున్నారని మండిప‌డ్డారు.వెంటనే మక్క, సోయాబిన్ పంట కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశారు. రెండుసార్లు రైతుబంధు ఇచ్చి రెండుసార్లు ఎగ్గొట్టార‌ని మండిప‌డ్డారు. పోయిన యాసంగి బోనస్ ఇంకా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే రూ. 1150 కోట్లను యాసంగి బోనస్ కింద సన్న వడ్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు హ‌రీశ్ రావు. సాగు చేసిన భూమికే రైతుబంధు ఇస్తామని చావు కబురు చల్లగా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు. మూడు పంటలకు రైతుబంధు ఇయ్యాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సాగుచేసిన భూమికే రైతు బంధు ఇస్తా అంటున్నాడని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *