పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంపీ హరీష్ బాలయోగి
ఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా పలు సమస్యలను ఏకరువు పెట్టారు ఎంపీ హరీష్ బాలయోగి. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువతకు నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు, వేగంగా మారుతున్న నేటి ఉద్యోగ మార్కెట్‌కు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్న , కష్టపడే యువత మన జిల్లాలో చాలా మంది ఉన్నారని చెప్పారు. కానీ ఈ ప్రాంతంలో శిక్షణా కేంద్రాలు లేకపోవడం వల్ల, వారి జీవితాలను మార్చే అవకాశాలను చాలా మంది కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ హరీష్ బాలయోగి.
ప్రతి యువతీ యువకుడికి నాణ్యమైన శిక్షణ అందుబాటులో ఉండేలా, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నైపుణ్య శిక్షణా సౌకర్యాలను ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు లోకసభలో 377 ద్వారా విజ్ఞప్తి చేశారు. సరైన శిక్షణ, తోడ్పాటుతో, మన యువత ఉద్యోగ అవకాశాలకు, భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. అంతే కాకుండా నైపుణ్యాలను పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకుంటే జిల్లా యువత భారతదేశ అభివృద్ధికి తోడ్పాటును అందించే దిశగా అడుగులు వేస్తారని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.






