ప్రకటించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి
నల్లగొండ జిల్లా : ఆరు నూరైనా సరే యుద్ద ప్రాతిపదికన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. గతంలో 10 ఏళ్లుగా పాలించిన బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు ఆగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి చేసేంత దాకా తాము ఊరుకునేది లేదన్నారు. అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైందన్నారు. శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా పూర్తి చేస్తుందని చెప్పారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు SLBC కోసం అనేక పోరాటాలు చేశారని అన్నారు.
SLBC సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మరణించినప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు స్పందించిన పాపాన పోలేదన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. దేవరకొండ రైతుల ప్రయోజనం కోసం డిండి ప్రాజెక్టును పూర్తి చేశామని అన్నారు. దేవరకొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. దేవరకొండలో మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి చదివిన పాఠశాలకు రూ.6 కోట్ల నిధులు అందిస్తాం అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. దేవరకొండకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేస్తాం అన్నారు.






