ఈశ్వ‌రాచారి సూసైడ్ చేసుకున్నా స్పందించ‌ని సీఎం

Spread the love

నిప్పులు చెరిగిన బీసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

హైద‌రాబాద్ : సాయి ఈశ్వ‌రాచారి బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం బ‌లిదానం చేసుకున్నా క‌నీసం కాంగ్రెస్ స‌ర్కార్ కానీ, సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించ లేద‌ని, సంతాపం కూడా తెలియ చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు బీసీ జేఏసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీసీల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగా చూసే పార్టీల‌కు వారు ఏమై పోయినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే సాయి ఈశ్వర చారి మరణం పట్ల సీఎం స్పందించే వార‌న్నారు. తెలంగాణలో ఉండి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనీసం ఫోన్ లో కూడా పరామర్శించ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే బాధ్యత బిసి మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే డిల్లీలో రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడిస్తామ‌ని హెచ్చ‌రించారు.

బీసీల‌ రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారి అంతిమయాత్ర సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని వందలాది మంది బీసీ సంఘాల శ్రేణులు హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో పాల్గొన్నారు . అంతిమయాత్ర సందర్భంగా దారి పొడవునా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బీసీలకు జరిగిన అన్యాయంపై, బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు మాట మార్చి మోసం చేసినందుకే సాయి ఈశ్వర చారి అన్యాయాన్ని తట్టుకోలేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని మరణించాడని వాపోయారు. ఒక తెలంగాణ బిసిబిడ్డగా ఈశ్వర చారి మరణిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవడం వారి బీసీ వ్యతిరేక నైజానికి నిదర్శనమన్నారు .

  • Related Posts

    ఓట్ల చోరీపై పోరాడాలి : సీఎం రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveకేంద్ర స‌ర్కార్ పై సంచ‌ల‌న కామెంట్స్ ఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఓట్ చోరీకి వ్య‌తిరేకంగా భారీ ఎత్తున…

    సీఎం చంద్ర‌బాబు రాక కోసం భారీ ఏర్పాట్లు

    Spread the love

    Spread the loveప‌రిశీలించిన ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తిరుప‌తి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తిరుప‌తి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఏర్పాట్లను ప‌రిశీలించారు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *