సీఎంను ఆహ్వానించిన కోమటిరెడ్డి
అమరావతి : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వరం మార్చారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన గొప్ప నాయకుడని, ముందు చూపు కలిగిన వ్యక్తి అని అన్నారు. అంతే కాదు స్వరం పూర్తిగా మార్చేశారు. ఏమైందో ఏమో కానీ నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ ను ఏకి పారేసిన కోమటిరెడ్డి ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకోవడం విస్తు పోయేలా చేసింది. తమ ప్రభుత్వం ఈనెల 8,9వ తేదీలలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఆనాడు జగన్ రెడ్డి అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఏ ఒక్కరు అడ్డుకోలేదన్నారు. కానీ తెలంగాణలో ఆయన అరెస్ట్ ను ఖండించానని, అంతే కాకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకోవద్దంటూ అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చానన్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆయనను ప్రతి ఒక్క నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సమ్మిట్ కు ప్రత్యేకంగా రావాలని ఆహ్వానించడం జరిగిందని చెప్పారు తనను కలిసిన అనంతరం మీడియాతో.






