మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా : కమ్యూనిస్టు పార్టీకి చెందిన అరుదైన నాయకుడు , మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు అంకితమైన గొప్పనైన జీవితం గుమ్మడి నర్సయ్యది అని పేర్కొన్నారు. నిబద్ధత, నిజాయితీ, సేవా భావానికి చిరస్మరణీయమైన ఉదాహరణ ఆయన అని కొనియాడారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నేటి తరం ప్రజా ప్రతినిధులకు నర్సయ్య నిజమైన ఆదర్శప్రాయం అని అన్నారు. అసెంబ్లీలో వారితో నా సాన్నిహిత్యం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని చెప్పారు. అవసరమైన ప్రోత్సాహక చర్యలు చేపడతామన్నారు.








