తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎక్కడా ఇసుమంత గర్వం అన్నది లేని నాయకుడు గుమ్మడి నర్సయ్య అంటూ కితాబు ఇచ్చారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివాసి ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. మనందరికీ ఆదర్శప్రాయుడు, ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి కూడా సాధారణ జీవితం గడిపిన, గడుపుతున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు కవిత.
తన జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు . వారి చరిత్ర మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారత దేశంలో సినిమాగా రావటం తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వ కారణం అన్నారు కవిత.. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని, ప్రేక్షకుల ఆదరణ పొందాలని, రాజకీయాల్లోకి రావాలనుకునే నేటి యువతకు స్ఫూర్తి నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.








